సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
డోర్నకల్: సీజనల్ వ్యాధుల వైద్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ ఆదేశించారు. స్థానిక పీహెచ్‌సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీతో పాటు గ్రామాల్లోని హెల్త్ సబ్‌సెంటర్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ఖాళీ పోస్టుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ని డోర్నకల్, తొర్రూరు, బయ్యారం, మరిపెడ, గూడూరు ఆస్పత్రుల్లో పది పడకల సామర్థ్యంతో ప్రత్యేక ఫీవర్ వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డోర్నకల్ పీహెచ్‌సీలో ఇక నుంచి 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని, రాత్రి వేళల్లో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి సాధ్విజ, సిబ్బంది పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు
ముగ్గు పోసిన డీపీఓ
గార్ల: మండలంలోని సత్యనారాయణపురం, సీతంపేట పంచాయతీల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) హరిప్రసాద్ మంగళవారం ముగ్గులు పోసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేస్తే దశలవారీగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తహసీల్దార్ వద్దకు వెళ్లి ఇల్లు మంజూరు పత్రం చూపిస్తే ఉచిత ఇసుక కూపన్లు అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు కూపన్ల ద్వారా ఉచితంగా ఇసుక పొందవచ్చని సూచించారు. ఎంపీడీఓ మంగమ్మ, పంచాయతీ కార్యదర్శులు అజ్మీరా కిషన్, అభిలాష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
రైతు భరోసా
నిధులు విడుదల
మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలోని 2,22,306 మంది రైతుల ఖాతాల్లో రూ.273.37 కోట్లు జమ చేయాల్సి ఉంది. సోమవారం రాత్రి నుంచి దశలవారీగా జమ అవుతుండగా.. మంగళవారం సాయంత్రం వరకు రూ.1,27,502 మంది రైతుల ఖాతాల్లోకి రూ.76.73 కోట్ల నిధులు జమ అయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయనిర్మల తెలిపారు.
కొత్త దరఖాస్తులు అందజేయాలి...
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు (సీసీఎల్‌ఏ నుంచి ఈనెల 5వ తేదీ వర కు పంపిన డేటా ఆధారంగా) తమ దరఖాస్తులను క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని సూచించారు. ఈనెల 20వ తేదీలోగా పాసుపుస్తకం జిరాక్స్ లేదా డిజిటల్స్ సంతకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్, దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి ఇవ్వాలని సూచించారు.
బాలిక అదృశ్యంపై విచారణ
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల హాస్టల్‌లో బాలిక అదృశ్యంపై మంగళవారం వైరా ఏటీడీఓ జహీరుద్దీన్ విచారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 17న గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల హాస్టల్‌లో బాలిక అదృశ్యమైందని, భద్రాచలం ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు పాఠశాల హెచ్‌ఎం, హాస్టల్ వార్డెన్‌పై విచారణ చేస్తున్నామని తెలిపారు. పూర్తి విచారణ చేపట్టి పీఓకు నివేదికలు అందిస్తామన్నారు. కాగా, జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో జరిగిన పలు సంఘటనపై విచారణ చేస్తున్నారని తప్ప చర్యలు తీసుకోవడం లేదు. కాగా, తప్పు చేస్తున్నది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అధికారులు, సిబ్బంది కావడంతోనే సస్పెండ్ చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుని, అందరికీ సామాజిక న్యాయం చేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి


