చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నాం
కోవిడ్ మళ్లీ ప్రబలుతుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాం. జిల్లా ఆసుపత్రికి ఇప్పటికే రోజుకు 1200 నుంచి 1500 వరకు ఔట్ పేషెంట్లు, 250 మంది ఇన్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నాం. కోవిడ్, సీజనల్ వ్యాధుల కోసం ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న మందులు పోగా అవసరమై వాటికోసం ఇండెంట్ పెట్టాం. అందరి సహకారంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రెడీగా ఉన్నాం.
– శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్


