మోక్షం | - | Sakshi
Sakshi News home page

మోక్షం

May 26 2025 1:12 AM | Updated on May 26 2025 1:12 AM

మోక్ష

మోక్షం

పెండింగ్‌ బిల్లులకు

మహబూబాబాద్‌: గ్రామ పంచాయతీల్లో గతంలో చేసిన అభివృద్ధి పనుల బకాయి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో సర్పంచ్‌లు సొంత డబ్బులతో పనులు చేయించారు. కాగా మూడేళ్లుగా వాటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మేరకు వారు బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రూ.10లక్షల లోపు ఉన్న బిల్లులకు మాత్రమే నిధులు విడుదల చేయగా.. మాజీ సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

482 జీపీలు..

జిల్లాలో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా జీపీల్లో 6,35,872 మంది జనాభా, 5,61,960 మంది ఓటర్లు, 1,75,551 గృహాలు ఉన్నాయి. సర్పంచ్‌ల పదవీకాలం 2024 జనవరి 31తో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు లేక పోవడంతో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. కాగా సర్పంచ్‌లో పదవిలో ఉన్నప్పుడు గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో మాజీ సర్పంచ్‌లు బిల్లుల కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 9,990 బిల్లులను క్లియర్‌ చేస్తూ నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 2024 ఆగస్టు లోపు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.10లక్షలలోపు ఉన్న బిల్లులన్నీ క్లియర్‌ కానున్నాయి.

సంబంధిత కార్యాలయాల చుట్టూ మాజీ సర్పంచ్‌లు..

ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు ప్రకటించగానే మాజీ సర్పంచ్‌లు డీటీఓ కార్యాలయం, డీపీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని అధికారులను అడుగుతున్నారు. అందుకు సంబంధిత అధికారులు తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, పేపర్లలో మాత్రమే చూశామని చెబుతున్నారు. మాజీ సర్పంచ్‌ల ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయని అధికారులు అంటున్నారు.

స్పెషల్‌ ఆఫీసర్ల పాలన..

సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్పెషల్‌ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ని ర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. మాజీ సర్పంచ్‌ల నిధులు విడుదలతో జీపీ ఎన్నికలు త్వరలోనే ఉంటాయనే సంకేతాలు కనిపిస్తున్నా యి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, రాజీవ్‌ యువ వికాసం తదితర పథకాలను వేగవంతం చేసింది. జీపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో అధికార పార్టీ అభివృద్ధి పనులను వేగవంతం చేసినట్లు అర్థమవుతోంది.

మండలాల వారీగా పెండింగ్‌ బిల్లులు

మండలం పెండింగ్‌ బిల్లుల డబ్బులు

బయ్యారం 14,842,354

చిన్నగూడూరు 51,358,84

దంతాలపల్లి 67,53,189

డోర్నకల్‌ 84,61,548

గంగారం 63,233,68

గార్ల 99,716,85

గూడూరు 47,862,457

కేసముద్రం 23,763,998

కొత్తగూడ 26,215,657

కురవి 13,028,911

మానుకోట 27,499,764

మరిపెడ 18,006,391

నర్సింహులపేట 83,93,430

నెల్లికుదురు 23,171,816

పెద్ద వంగర 92,59,513

తొర్రూరు 86,32.184

మొత్తం 25,73,22,149

మాజీ సర్పంచ్‌లకు ఊరట

రూ 10.లక్షలలోపు బిల్లులకు క్లియరెన్స్‌

2024 ఆగస్టులోపు చేసిన పనులకే..

ఎలాంటి ఉత్తర్వులు రాలేదు

నిధుల విషయంలో ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. గతంలో జిల్లాలో పెండింగ్‌ బిల్లుల జాబితా పంపించాం. ఆ బిల్లులు అన్ని ఎస్టీఓ కార్యాలయంలోనే జరిగాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాల వస్తే దాని ప్రకారం ప్రాసెస్‌ చేస్తాం.

– హరిప్రసాద్‌, డీపీఓ

వారి ఖాతాల్లో జమ అవుతాయి

అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చేసి ప్రభుత్వానికి పంపాం. క్లియర్‌ చేసే బిల్లుల డబ్బులు మాజీ సర్పంచ్‌ల ఖాతాల్లోనే జమ అవుతాయి. వాటికి సంబంధించిన ప్రత్యేక జాబితా లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.

– వి.సత్యనారాయణ, డీటీఓ

మోక్షం1
1/1

మోక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement