
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
విద్యారణ్యపురి: యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష–2025 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం అభ్యర్థులు 4,141 మందికి గాను హనుమకొండ జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్‌లో 2,435 మంది(58.80శాతం), మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షకు 2,422మంది(58.49శాతం)మంది హాజరైనట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించి అడ్మిట్‌కార్డుతోపాటు గుర్తింపు కార్డు పరిశీలించడంతోపాటు క్షుణ్ణంగా తనిఖీచేశాకే ఉదయం 9 గంటల వరకు లోనికి అనుమతించారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్‌కాలేజీ, ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కేంద్రాలను కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు.
ఉదయం సెషన్‌లో 58.80శాతం..
మధ్యాహ్నం సెషన్‌లో 58.49శాతం హాజరు

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం