
పుష్కరాల్లో తనికెళ్ల భరణి ప్రవచనాలు
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాల్లో ఆదివారం సినీనటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. సరస్వతి(వీఐపీ)ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించిన అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సరస్వతి ఘాట్ వద్ద సంగీత్ నాటక్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా స్వామి వారి ప్రవచనాలు చెప్పారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ప్రాముఖ్యత, త్రివేణి సంగంమం, సరస్వతీనది పుష్కరాల గొప్పతనం గురించి వివరించారు.