
పాలిసెట్ ఫలితాల విడుదల
విద్యారణ్యపురి: తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్–25 ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో 1,554 మంది అభ్యర్థులకు 1,331 మంది (85.65శాతం) ఉత్తీర్ణత సాఽధించినట్లు వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. హనుమకొండ జిల్లాలో పాలిటెక్నిక్ ఎంపీసీ స్ట్రీమ్‌లో బాలురు 3,374 మంది పాలిసెట్‌కు హాజరుకాగా.. వారిలో 2,742 మంది (81.27 శాతం), బాలికలు 2,875 మంది హాజరుకాగా 2,478 మంది (86.19 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. వరంగల్ జిల్లాలో బాలురు, బాలికలు కలిపి 481 మందికి 428 మంది (88.90 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ములుగు జిల్లాలో బాలురు, బాలికలు కలిపి మొత్తం 668 మందికి 551 మంది(82.49శాతం) ఉత్తీర్ణత సాధించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 824 మంది అభ్యర్థుకు 683 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత (82.89 శాతం) సాధించారు. జనగామ జిల్లాలో 1,343 మంది అభ్యర్థులకు 1,070 మంది (79.67శాతం) ఉత్తీర్ణత సాఽధించారు.
జిల్లాలో ఉత్తమ ర్యాంకులు
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన పలువురు విద్యార్థులు ఇటీవల విడుదలైన పాలిసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. జిల్లా కేంద్రానికి చెందిన జక్కుల ఉపేందర్, కృష్ణవేణి దంపతుల కుమారుడు షణ్ముక ఎంపీసీ విభాగంలో 75, ఎంబైపీసీ విభాగంలో 83వ ర్యాంకు సాధించాడు. అలాగే గంజి వెంకటనారాయణ, జ్యోతి దంపతుల కుమార్తె లక్ష్మీతనుజ ఎంపీసీ గ్రూప్‌లో 230, ఎంబైపీసీలో 54వ రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. ఈ మేరకు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు పలువురు అభినందించారు.
జిల్లాలో 85.65శాతం ఉత్తీర్ణత

పాలిసెట్ ఫలితాల విడుదల