
భ్రూణహత్యలు నివారించాలి
నెహ్రూసెంటర్: జిల్లాలో భ్రూణహత్యల నివారణకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ చట్టం, జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ, మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ పై సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫిమేల్ లింగ నిష్పత్తి తక్కువగా ఉందని, అబార్షన్ రేటు ఎక్కువగా ఉందన్నారు. ఫిమేల్ లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిబంధనలకు విరుద్దంగా లింగ నిష్పత్తి జరిగిన, అబార్షన్ చేసిన చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ జగదీశ్వర్, జీపీ నగేష్, డాక్టర్ మీనాక్షి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ నాగవాణి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వాహిని, కౌన్సిలర్ రమేష్, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ వెంకటేష్, హెచ్‌ఈ కేవీ రాజు, లోక్య, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, అరుణ్, మనోహర్, అనిల్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవిరాథోడ్