
రోడ్డు సదుపాయం కల్పించాలి
వీసీలో మంత్రి సీతక్క
మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలం నుంచి దుబ్బతండాకు రోడ్డు సదుపాయం కల్పించాలని మంత్రి సీతక్క సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల అటవీ సమస్యలు, పర్యావరణ తదితర వాటిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రులు వీసీ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, సీతక్క మాట్లాడారు. వీసీలో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ కె.వీర బ్రహ్మచారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
యూనిఫాం
అందజేతకు సిద్ధం
మహబూబాబాద్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం అందించేందుకు సిద్ధం చేస్తున్నామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి మధుసూదన్ రాజు అన్నారు. మహబూబాబాద్ మండలంలోని లక్ష్మీపురం (బి) జీపీ పరిధిలోని జిల్లెళ్లగూడెం గ్రామంలో స్కూల్ యూనిఫాం కుట్టు శిక్షణ కేంద్రాన్ని డీఆర్డీఓ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ యూనిఫాం కుట్టు పనులు ఎంత వరకు పూర్తి అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. త్వరగా స్కూల్ యూనిఫాం కుట్టు పనులు పూర్తిచేసి పాఠశాలలకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం తిలక్, సీసీ రూపాదేవి, వీఓఏ శశికళ, కుట్టు శిక్షణ కేంద్రం సభ్యులు పాల్గొన్నారు.
గార్ల రైల్వేగేటు ఓపెన్
గార్ల: గార్ల– డోర్నకల్ మధ్య గల రైల్వేగేటును శనివారం రైల్వే ఉన్నతాధికారులు ఓపెన్ చేశారు. గార్ల నుంచి డోర్నకల్ మధ్యలో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ కాల్వ రైల్వే ట్రాక్ కింద నుంచి తీస్తున్నందున గత 2 నెలల నుంచి రైల్వే గేటును రైల్వే అధికారులు మూసివేశారు. దీంతో ఖమ్మం నుంచి గార్లకు వచ్చే వాహనదారులు, ఆర్టీసీ ప్రయాణికులు బుద్దారం నుంచి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెనాల్ కోసం పక్కనే ఆర్‌అండ్‌బీ రహదారి తవ్వడంతో కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయడంతో రైల్వే అధికారులు రైల్వేగేటును ఓపెన్ చేశారు. దీంతో రెండు మండలాల ప్రజలకు ఇబ్బందులు తొలగినట్లయింది. రైల్వే ఉన్నతాధికారులు డీఎన్ దినకరన్, ఏఎన్ రమేష్‌బాబు, ఐఓడబ్ల్యూ అఖిల్, రైల్వేబోర్డు కమిటీ సభ్యులు ఖాదర్‌బాబా, జర్పుల లచ్చిరాంనాయక్‌లకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో 2017 సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసిన నిరుద్యోగ విద్యార్థుల నుంచి ఉన్నతి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జాక్విలిన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వృత్తి నైపుణ్యంపై 45 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, 18 నుంచి 25 సంవత్సరాల మధ్యగల వారు అర్హులన్నారు. ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తులు పంపాలన్నారు. వివరాలకు 9704550189 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని ఆమె కోరారు.
రైళ్ల రద్దుతో ఇబ్బందులు
కేసముద్రం: మహబూబాబాద్ రైల్వేస్టేషన్‌లో థర్డ్‌లైన్ అనుసంధాన పనుల్లో భాగంగా సింగరే ణి, శాతవాహన, గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ర ద్దు చేసి, కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలును మాత్రమే నడుపుతున్నారు. దీంతో కేసముద్రం రైల్వేస్టేష న్ శనివారం కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందు కు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలోని డోర్నకల్, గార్ల, గుండ్రాతిమడుగు, మహబూబాబాద్, తాళ్లపూసపల్లి, కేసముద్రం రైల్వే స్టేషన్‌లలో కాకతీయ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఉండటం, ఉదయం అప్‌లైన్‌లో ప్రయాణించే ప్ర యాణికులు ఆయా రైల్వేస్టేషన్‌లలో ఎక్కడంతో బోగీలన్ని ప్రయాణికులతో కిక్కిరిసిపోయా యి. ఈ క్రమంలో కేసముద్రం రైల్వేస్టేషన్‌లో ప్ర యాణికులంతా రైలు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొందరు ప్లాట్‌ఫాంపైనే ఉ న్నారు. అలాగే పలు రైళ్లకు కేసముద్రం రైల్వే స్టే షన్‌లో హాల్టింగ్ ఉండటంతో మహబూబా బాద్‌లో దిగాల్సిన ప్రయాణికులు కేసముద్రంలో దిగి బస్సులు, ఇతర వాహనాల్లో తమ గమ్యస్థానా నికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.

రోడ్డు సదుపాయం కల్పించాలి