పైఎత్తు వేద్దామా.. | - | Sakshi
Sakshi News home page

పైఎత్తు వేద్దామా..

May 9 2025 1:02 AM | Updated on May 9 2025 1:02 AM

పైఎత్

పైఎత్తు వేద్దామా..

ఎత్తుకు

సంతోషంగా ఉంది..

పదిహేను రోజులుగా చెస్‌ నేర్చుకుంటున్నా. మొదటి రోజు ఏనుగు, గుర్రం, ఒంటె, సైనికులు అంటూ సార్‌ చెబుతుంటే ఏం అర్థం కాలేదు. నాలుగైదు రోజుల తర్వాత నుంచి కొద్దిగా ఆడడం వస్తోంది. ఇప్పుడు ఆడుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి రోజు మూడు గంటల శిక్షణ, ఆ తర్వాత ఇంటికెల్లాక ప్రాక్టీస్‌ చేస్తున్నా.

– శాన్విక , రెండో తరగతి, శ్రీనివాసకాలనీ

మూడు గంటల శిక్షణ

వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ శిబిరానికి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి 11గంటల వరకు శిక్షణ అందిస్తున్నాం. చెస్‌ అర్థం కావడానికి కొందరికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది. సులువైన పద్ధతుల్లో చెస్‌ ఆడడం నేర్పిస్తున్నా.. ఏప్రిల్‌ 24న ప్రారంభమైన శిబిరం ఈనెల 24న ముగియనుంది. వేసవి శిబిరం అనంతరం కూడా మా అకాడమీలో తరగతులు నిరంతరం కొనసాగుతుంటాయి. ఆన్‌లైన్‌ ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నాం. వివరాలకు 90595 22986 సెల్‌ నంబర్‌లో సంప్రదించవచ్చు.

– కన్నా, అకాడమీ నిర్వాహకుడు

వేసవిలో చెస్‌ శిక్షణ తరగతులు

చిన్నారుల మేధస్సుకు పదును ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు

వరంగల్‌ స్పోర్ట్స్‌: కాస్త సమయం దొరికిందంటే చాలు సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేసే పిల్లలే ఎక్కువ.. ప్రస్తుతం వేసవి సెలవులు తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన పెంచుతున్నాయి. సె లవుల్లో పిల్లలను ఫోన్‌కు ఎలా దూరంగా ఉంచాలో తెలియక కొందరు తల్లిదండ్రులు తికమక పడుతుండగా.. పిల్లలను ఖాళీగా ఉంచకుండా వారి మేధస్సుకు పదునుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరికొందరు అమ్మానాన్నలు.

చదరంగంలో శిక్షణ అందిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేయడమెలా? అంటూ మెదడుకు పదునుపెట్టిస్తున్నారు. దీంతో పిల్లలు సైతం మరో ఆలోచనలోకి వెళ్లకుండా శ్రద్ధగా చదరంగంలో శిక్షణ పొందుతున్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఎస్‌ఎంఆర్‌ స్కూల్‌లో కన్నా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చదరంగ వేసవి శిక్షణ శిబిరంలో చిన్నారులు చెస్‌ బోర్డుపై పావులు కదుపుతూ బిజీగా మారిపోయారు. ఈక్రమంలో చదరంగం ఆట తీరు, ఎలా ఆడతారు? చెస్‌బోర్డు విశేషాలు, శిక్షణ పొందుతున్న చిన్నారుల అభిప్రాయాలతో ‘సాక్షి’ కథనం.

మొత్తం 64 గల్లు

17సెంటిమీటర్ల పొడవు, 18 సెంటీమీటర్ల వెడల్పుతో 32 తెలుపు, 32 నలుపు గల్లతో ఆకర్షణీయంగా ఉండే చదరంగ బోర్డు మనిషిలోని మేధస్సును తట్టిలేపుతుందనడంలో అతిశయోక్తి లేదు. చదరంగంలో ఆరితేరారంటే జీవితంలోని ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొనే సామర్థ్యం పొందొచ్చని చెప్చొచ్చు. మానవమేధస్సుకు పదునుపెట్టే ఈ చదరంగం పుట్టినిల్లు భారతదేశం కావడం విశేషం. భారత్‌లో పుట్టిన చదరంగం ప్రస్తుతం విశ్వక్రీడగా విరాజిల్లుతోంది.

ఆట ఇలా...

చెస్‌ అనగానే మనందరికీ తెలిసింది.. సైనికులు, ఏనుగు, ఒంటె, గుర్రం, రాజు, మంత్రి వీటిలో ఒక్కో పావుకు విభిన్న కదలికల రూపం ఉంటుంది. ఇందులో రెండు రుక్‌ (ఏనుగు)లు, రెండు నైట్‌ (గుర్రం)లు, రెండు బిషప్‌ (ఒంటె)లు, ఒక కింగ్‌ (రాజు), ఒక క్వీన్‌(మంత్రి), 8 మంది పాన్‌ (సైనికులు)లు ఉంటారు. పాన్‌లను ముందుకు కదుపుతూ.. అత్యవసర సమయంలో మిగిలిన పావులను కదుపుతూ ప్రత్యర్థిని కట్టడి చేస్తూ ఆడాల్సి ఉంటుంది.

మూడు విభాగాల్లో..

టోర్నమెంట్లలో 3 నిమిషాల్లోపు ఆడే ఆటను బుల్లెట్‌గా, 5 నిమిషాల్లోపు ముగించే ఆటను బ్లిడ్జ్‌గా, 10 నుంచి 15 నిమిషాలకు పైగా ఉండే ఆటను ర్యాపిడ్‌ వి భాగంగా, 25 నిమిషాలు, ఆపై ఆడే ఆటను క్లాసికల్‌ గేమ్‌గా పిలుస్తారు.

టైం సరిపోవట్లేదు..

వారం రోజులు చెస్‌పై అసలు పట్టు దొరకలేదు. అప్పుడు చెస్‌ అంటేనే భయమేసేది. ఇప్పుడు ఆడుతుంటే అసలు టైమే సరిపోవడం లేదు. ఒకటి రెండు ఆటలు ఆడడానికే రెండు మూడు గంటల సమయం పడుతోంది. సార్‌ కొత్త టెక్నిక్స్‌తో ఎలా ఆడాలో చెబుతున్నారు. రోజుకో టెక్నిక్‌తో చెస్‌పై మరింత శ్రద్ధ పెరిగింది.

– అక్షిత, రాంనగర్‌

పైఎత్తు వేద్దామా..1
1/4

పైఎత్తు వేద్దామా..

పైఎత్తు వేద్దామా..2
2/4

పైఎత్తు వేద్దామా..

పైఎత్తు వేద్దామా..3
3/4

పైఎత్తు వేద్దామా..

పైఎత్తు వేద్దామా..4
4/4

పైఎత్తు వేద్దామా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement