
పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు
మహబూబాబాద్ అర్బన్: బీజేపీలో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ సభ్యుల నియామకం చేపట్టా రు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిల్లాలోని మూడు మండలాలకు అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ సభ్యులను నియమించామన్నారు. మరిపెడ మండల అధ్యక్షుడిగా కట్టోజు గంగాధర్, నర్సింహులపేట అధ్యక్షుడిగా సూరబోయిన సతీష్, కురవి మండల అధ్యక్షుడిగా భూక్య కిషన్ నాయక్, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా భూక్య సుధాకర్ నాయక్, గండి రమేశ్‌గౌడ్, మోదుగులగూడెం గ్రామానికి చెందిన కోడి రామకృష్ణను నియమించామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వద్దిరాజు రామచంద్రరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యాంసుందర్ శర్మ, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చీకటి మహేశ్‌గౌడ్, పార్లమెంట్ కో కన్వీనర్ సతీష్, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, అశోక్, సందీప్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.