గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
కొత్తగూడ: గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని బత్తులపల్లిలో రూ.2 కోట్ల నిధులతో నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగూడ, గంగారం మండలాలు వైల్డ్ లైఫ్ సాంచురీలో ఉన్నా వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చిందన్నారు. బీజేపి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణననే కాపీ కొట్టిందన్నారు. అంతకుముందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రేమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో సీఈ చౌహన్, ఎస్‌ఈ నరేష్, డీఈలు విజయ్, సునీత, ఈడీఈలు కవిత, అయిలయ్య, ప్రణయ్, నాయకులు వజ్జ సారయ్య, చల్ల నారాయణరెడ్డి, ఇర్ప రాజేశ్వర్, మొగిళి, రూప్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలో మూతపడిన ప్రభుత్వ ఎస్సీ హాస్టల్‌ను గురుకుల పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలని నేతకాని కుల సంఘం నాయకులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
గంగారంలో..
గంగారం: గంగారం మండలంలోని కోమట్లగూడెం గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రం 33/11కేవీ పనులకు మంత్రి సీతక్క శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలోని పోడు భూములకు పట్టాలు పొందిన రైతులకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. గిరిజన ప్రాంతంలో లోఓల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
మంత్రి సీతక్క
బత్తులపల్లిలో సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన


