టెక్నికల్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌● | - | Sakshi
Sakshi News home page

టెక్నికల్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌●

Mar 16 2025 12:53 AM | Updated on Mar 16 2025 12:53 AM

టెక్న

టెక్నికల్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌●

ఈనెల 20 వరకు నామినేషన్ల ప్రక్రియ

28న ఓటింగ్‌..

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ టెక్నికల్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి టి. మనోహర్‌ శనివారం నోటిఫికేషన్‌ జారీచేశారు. ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, జనరల్‌ సెక్రటరీ, జాయింట్‌ సెక్రటరీలు, ఆర్గనైజేషన్‌ –1, ఆర్గనైజేషన్‌ –2 (ఉమెన్‌), రిక్రియేషన్‌ పదవులకు ఒక్కో పదవికి నోటిఫికేషన్‌ ఇచ్చారు. మూడేళ్ల పదవి కాలానికి ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈనెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం స్క్రూటీని చేసి ఈనెల 21న నామినేషన్ల వివరాలు వెల్లడిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈనెల 22న మధ్యాహ్నం 3గంటల వరకు ఉంటుంది. తుదిగా అభ్యర్థుల జాబితా 22న సాయంత్రం 4. 30 గంటలకు వెల్లడిస్తారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు 24న గుర్తులు కేటాయిస్తారు. ఓటింగ్‌ ప్రక్రియ 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు క్యాంపస్‌లోని యూని వర్సిటీ కాలేజీలో ఉంటుంది. 29న సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, ఈ ఎన్నికల నోటిఫికేషన్‌తో కేయూ టెక్నికల్‌ స్టాఫ్‌ ఎంప్లాయీస్‌లో ఎన్నికల సందడి మొదలైంది.

యూట్యూబ్‌ విలేకరిపై కేసు

ఖిలా వరంగల్‌: నిజ నిర్ధారణ లేకుండా ఫొటోలతో సహా సామాజిక మధ్యమాల్లో ఓ కథనం పోస్టు చేసిన ఓ యూట్యూబ్‌ విలేకరిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకటరత్నం తెలిపారు. ఓ యువతి విషయంలో పూర్తి సమాచారం లేకుండా.. కనీసం నిబంధనలు పాటించకుండా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన క్లిప్పింగ్స్‌ ఆధారంగా సదరు విలేకరిపై శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. శనివారం అతడిని పోలీసులు స్టేషన్‌లో విచారించినట్లు సమాచారం.

సీకేఎంలో ఫెర్టిలిటీ

ఓపీ సేవలు షురూ

ఎంజీఎం: వరంగల్‌ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శనివారం ఫెర్టిలిటీ ఓపీ సేవలను సూపరింటెండెంట్‌ షర్మిల ప్రారంభించారు. ప్రస్తుతం అందిస్తున్న గర్భిణులకు సేవలతో పాటు సంతాన భాగ్యం లేని దంపతులకు మరింత మెరుగైన ఓపీ వైద్యసేవలందించేందుకు ప్రత్యేక ఓపీ విభాగాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాలతో ప్రత్యేక ఓపీ ప్రారంభించి ఔషధాలు సైతం ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈసేవలు ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. సంతాన లేమితో ఇబ్బందులు పడుతున్న దంపతులు.. ఈ విభాగంలో నమోదు చేసుకుని ఉచిత వైద్యసేవలు పొందొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు మురళి, సత్యజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

టెక్నికల్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌●1
1/1

టెక్నికల్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement