జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి | - | Sakshi
Sakshi News home page

జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

Mar 16 2025 12:52 AM | Updated on Mar 16 2025 12:52 AM

జగదీష

జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

మున్సిపల్‌ మాజీ వైస్‌ చెర్మన్‌ వెంకన్న

మహబూబాబాద్‌: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మార్నేని వెంకన్న డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నెహ్రూసెంటర్‌లో ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ను అమలు చేయాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయిని రంజిత్‌, తేళ్ల శ్రీనివాస్‌, జెరిపోతుల వెంకన్న, మార్నెని రఘు, అశోక్‌, నీలేష్‌రాయ్‌, రావిష్‌, లక్ష్మణ్‌, రాము, రాజేష్‌, అమీర్‌, తదితరులు పాల్గొన్నారు.

సేంద్రియ సాగు

ఆరోగ్యానికి మేలు

కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త ఉమారెడ్డి

కొత్తగూడ: రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల లాభాలతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త ఉమారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. కేన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులు నేడు గ్రామీణ ప్రాంతాల వరకు చేరుకోవడానికి కారణం విచ్చలవిడిగా రసాయనాలు వినియోగించడమేనన్నారు. రసాయనాల వినియోగంతో భూసారం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. సేంద్రియ సాగుతో ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడిని పెంచవచ్చన్నారు. దొరవారివేంపల్లి, ఈశ్వరగూడెం గ్రామాల నుంచి సేంద్రియ సాగు చేసేందుకు ముందుకు వచ్చిన రైతులకు దేశవాలి ఆవులు, మేకలను ప్రభుత్వ సహకారంతో ఉచితంగా అందించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఉదయ్‌, పశు వైద్యాధికారి శ్రీకాంత్‌, ఏఈఓ రాజు పాల్గొన్నారు.

అంతర్‌ జిల్లా దొంగ అరెస్ట్‌

108 గ్రాముల బంగారం స్వాధీనం

వివరాలు వెల్లడించిన

డీఎస్పీ తిరుపతిరావు

మహబూబాబాద్‌ రూరల్‌: అంతర్‌ జిల్లా దొంగను అరెస్ట్‌ చేసి 108గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎన్‌.తిరుపతిరావు తెలిపారు. శనివారం టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. కురవి మండల ప్రాంతంలో సీసీఎస్‌ హతిరాం, ఎస్సైలు తాహెర్‌బాబా, గోపి సతీష్‌, సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తుండగా కురవి బస్టాండ్‌ దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పగటి పూట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి, కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన పున్నెం రాజు గతేడాది జూలై నుంచి మార్చి వరకు సుమారు వివిధ జిల్లాల్లో 11 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 108 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతర్‌ జిల్లా దొంగని పట్టుకున్న సీసీఎస్‌ హతిరాం, ఎస్సైలు తాహెర్‌ బాబా, గోపి, కురవి ఎస్సై సతీష్‌, సిబ్బందిని జిల్లా ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అభినందించారు. డీఎస్పీ తిరుపతిరావు వారికి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ సర్వయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌  ఎత్తివేయాలి1
1/2

జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌  ఎత్తివేయాలి2
2/2

జగదీష్‌రెడ్డిపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement