రోడ్డుపై యువకుల న్యూసెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

రోడ్డుపై యువకుల న్యూసెన్స్‌

Mar 15 2025 1:43 AM | Updated on Mar 15 2025 1:42 AM

హసన్‌పర్తి: హోలీ రంగుల్లో మునిగితేలిన యువకులు చిత్తుగా మద్యం సేవించారు. ఎదురుగా వస్తున్న కారును ఆపారు.. కారు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగి.. అద్దాలు పగులగొట్టారు. 56వ డివిజన్‌ వివేకానంద కాలనీలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద కాలనీకి చెందిన ఓ కారు హనుమకొండ వైపునకు బయల్దేరింది. అప్పటికే చిత్తుగా మద్యం సేవించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏడుగురు వలస కూలీలు ఆ కారు అడ్డగించారు. తమకు కారు తాళం చెవి ఇవ్వమని డిమాండ్‌ చేశారు. అందుకు కారు డ్రైవర్‌ నిరాకరించడంతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మరో యువకుడు బండరాయిని కారు అద్దాలపైకి విసరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. స్థానికులు ఆపడానికి ప్రయత్నించగా యువకులు మరింత రెచ్చిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటన సమయంలో కారులో డ్రైవర్‌తోపాటు కారు యజమాని(మహిళ) ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తులసీ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌ను తొలగించాని, నిత్యం మద్యంప్రియులు గొడవలు చేస్తుండడంతో ఇబ్బందిగా ఉందని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

కారు ఆపి అద్దాలు పగులగొట్టి హల్‌చల్‌

రోడ్డుపై యువకుల న్యూసెన్స్‌ 1
1/1

రోడ్డుపై యువకుల న్యూసెన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement