కిడ్నీ పదిలమేనా..? | - | Sakshi
Sakshi News home page

కిడ్నీ పదిలమేనా..?

Mar 13 2025 7:45 PM | Updated on Mar 13 2025 7:45 PM

కిడ్న

కిడ్నీ పదిలమేనా..?

నెహ్రూసెంటర్‌: మానవ శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. వాటిని రక్షించుకుంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. ఈమేరకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా బీపీ, షుగర్‌, అధికంగా పెయిన్‌కిల్లర్‌ టాబ్లెట్స్‌ విని యోగం, పాయిజన్‌ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. బీపీ, షుగర్‌ కంట్రోల్‌ చేసుకోవడం, వ్యాయామం చేయడం, సరిపడా నీరు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గించుకోవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

బాధితులు..

జిల్లాలో 590పైగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఉంటారని అధికారులు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలున్న వారికి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా కిడ్నీలపై అవగాహన పెంచడంతో పాటు, వాటి ప్రాముఖ్యతను చెప్పేందుకు ప్రతి ఏడాది మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

పెరుగుతున్న రోగులు...

మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు, టాబ్లెట్ల వినియోగం, అధికంగా మద్యం సేవించడం వంటివి కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో బీపీ, షుగర్‌ బాధితులతో పాటు కిడ్నీ బాధితులు కూడా పెరుగుతున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు ఏడాదికోసారి ఆరోగ్య పరీక్ష తప్పకుండా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

జీజీహెచ్‌లో డయాలసిస్‌

సేవలు...

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 80 మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ సేవలను అందజేస్తున్నారు. ఇటీవల మరో అదనపు 5 బెడ్లను ప్రారంభించడంతో డయాలసిస్‌ సేవలు అందుతున్నాయి. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే బాధితులకు కొంత ఉపశమనం దక్కింది. పెరుగుతున్న రోగుల దృష్ట్యా మరికొన్ని అదనపు బెడ్స్‌ అందించి బాధితులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు.

ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలి. ప్రతీ రోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. బీపీ, షుగర్‌ను అదుపు చేసుకోవాలి. చనిపోయేందుకు పాయిజన్‌ తీసుకున్న వారిలో అధికంగా కిడ్నీ సమస్యలు ఎదురవుతున్నాయి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

– డాక్టర్‌ హరిప్రసాద్‌,

మూత్ర పిండాల వైద్య నిపుణులు

రోజురోజుకూ పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో

డయాలసిస్‌ సేవలు

జాగ్రత్తలు తీసుకోవాలని

సూచిస్తున్న వైద్యులు

నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం

కిడ్నీ పదిలమేనా..?1
1/1

కిడ్నీ పదిలమేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement