విద్యాసంస్థలు, పరిశ్రమల కలయికతోనే నూతన ఆవిష్కరణలు | - | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థలు, పరిశ్రమల కలయికతోనే నూతన ఆవిష్కరణలు

Mar 13 2025 7:45 PM | Updated on Mar 13 2025 7:45 PM

విద్య

విద్యాసంస్థలు, పరిశ్రమల కలయికతోనే నూతన ఆవిష్కరణలు

సైయంట్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ బీవీ.మోహన్‌రెడ్డి

కాజీపేట అర్బన్‌ : విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేసిన తరుణంలోనే నూతన ఆవిష్కరణలకు నాంది పలకవచ్చని సైయంట్‌ కంపెనీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ బీవీ.మోహన్‌రెడ్డి తెలిపారు. నిట్‌ వరంగల్‌లోని అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ–అకాడమీ ఇన్నోవేషన్‌ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు కంప్యూటర్‌ జ్ఞానం, కమ్యూనికేషన్‌, సెన్సార్లు, డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా 47 సంస్థలకు చెందిన 80 వివిధ పరిశ్రమల నిపుణులు ఆవిష్కరించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ, ప్రొఫెసర్లు శిరీష్‌ సోనావానే, సుభాష్‌ చంద్రబోస్‌, తదితరులు పాల్గొన్నారు.

గ్రూప్‌–2లో మహిళా విభాగంలో సాయిచందనకు 9వ ర్యాంకు

కమలాపూర్‌: హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌కు చెందిన మిల్కూరి రవీందర్‌, అరుణ దంపతుల కూతురు సాయిచందన ఇటీవల విడుదలైన గ్రూప్‌–2 ఫలితాల్లో మహిళా విభాగంలో 9వ ర్యాంకు సాధించింది. 386.11 మార్కులు సాధించిన సాయిచందన జనరల్‌ కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో 162వ ర్యాంకు సాధించింది. ఇప్పటికే కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న సాయిచందన కుటుంబం ప్రస్తుతం కాజీపేటలో నివాసం ఉంటోంది. కాగా, సాయిచందన గ్రూప్‌–1లో కూడా 453 మార్కులు సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సర్వే రెమ్యునరేషన్‌

చెల్లించాలి

వరంగల్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత నవంబర్‌లో నిర్వహించిన సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లుగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే రెమ్యునేషన్‌ చెల్లించాలని టీపీటీఎఫ్‌, జీటీఏ జిల్లా అధ్యక్షులు యూ.అశోక్‌, టి.ప్రకాశ్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. నాలుగు నెలలు గడిచినా రెమ్యునరేషన్‌ చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ వరంగల్‌ కాశిబుగ్గలోని కార్పొరేషన్‌ సర్కిల్‌ కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం నిరసన తెలిపారు. నిరసన ప్రదర్శనలో బాలవద్దిరాజు, కే.ఉమేశ్‌, హరిప్రసాద్‌, కృష్ణమూర్తి, అశోక్‌, సునీల్‌కుమార్‌, సిద్దేశ్వర్‌, జోసెఫ్‌, శ్రీధర్‌, శ్రీవాణి, జ్యోతి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

విద్యాసంస్థలు, పరిశ్రమల కలయికతోనే నూతన ఆవిష్కరణలు1
1/3

విద్యాసంస్థలు, పరిశ్రమల కలయికతోనే నూతన ఆవిష్కరణలు

విద్యాసంస్థలు, పరిశ్రమల కలయికతోనే నూతన ఆవిష్కరణలు2
2/3

విద్యాసంస్థలు, పరిశ్రమల కలయికతోనే నూతన ఆవిష్కరణలు

విద్యాసంస్థలు, పరిశ్రమల కలయికతోనే నూతన ఆవిష్కరణలు3
3/3

విద్యాసంస్థలు, పరిశ్రమల కలయికతోనే నూతన ఆవిష్కరణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement