సమీపిస్తున్న గడువు.. | - | Sakshi
Sakshi News home page

సమీపిస్తున్న గడువు..

Mar 11 2025 1:14 AM | Updated on Mar 11 2025 1:12 AM

మహబూబాబాబాద్‌: పన్నుల వసూళ్లలో జిల్లాలోని మున్సిపాలిటీలు వెనుకబడి ఉన్నాయి. వందశాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. అంతంత మాత్రంగానే వసూళ్లు చేశారు. నేటి వరకు 65శాతం కూడా ఇంటి పన్నులు వసూళ్లు కాలేదు. సరిపడా సిబ్బంది ఉన్నా.. అలసత్వం వహిస్తున్నారని ఉన్నాతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా పన్నుల వసూళ్లకు మరో 20 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది.

జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు..

జిల్లాలో మానుకోట, తొర్రూరు, డోర్నకల్‌, మరిపె డ మున్సిపాలిటీలు ఉండగా ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. మానుకోట మున్సిపాలిటీలో 36వార్డులు ఉండగా68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు, 25,000 పైగా గృహాలు ఉన్నాయి. అలాగే తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు, 19,100మంది జనాభా ఉండగా.. మరిపెడ మున్సిపాలిటీలో 15 వార్డులు, 17, 875 మంది జనాభా, డోర్నకల్‌లో 15 వార్డులు 14,425 మంది జనాభా ఉంది. కాగా మానుకోట మున్సిపాలిటీలో 11మంది బి ల్‌ కలెక్టర్లు, 22 మంది వార్డు ఆ ఫీసర్లు,ముగ్గురు ఎన్‌ఎంఆర్‌ (నామినల్‌ మస్టర్‌ రూల్‌)తో ఇంటి పన్నులు, నల్లా పన్నులు ,ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు,ఇతర ప న్నులు వసూళ్లు చేస్తున్నారు. మి గిలిన మున్సిపాలిటీల్లో కూ డా బిల్‌కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు వసూలు చేస్తున్నారు.

65శాతం దాటని వసూళ్లు..

2024 –25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని మానుకోట, మరిపెడ, డోర్నకల్‌, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఇంటి పన్నుల వసూళ్లు 65 శాతం కూడా దాటలేదు. వసూళ్లను వేగవంతం చేసి వందశాతం పూర్తి చేయాలని మున్సిపల్‌ సీడీఎంఏ శ్రీదేవి పలు మార్లు కమిషనర్లతో వీసీ నిర్వహించి ఆదేశించినా పురోగతి అంతంత మాత్రమే ఉంది.

మరీ దారుణం..

మున్సిపాలిటీల్లో ఇంటి పన్నుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే.. నల్లా పన్నులు, ట్రేడ్‌ లైసెన్స్‌, ఇతర పన్నుల విషయంలో వెనకబడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడింది. దీనికి తోడు పన్నులు కూడా అంతంతమాత్రంగానే వసూళ్లు అవుతున్నాయి. ఈ పన్నుల ద్వారా వచ్చిన జనరల్‌ ఫండ్‌ను సిబ్బంది వేతనాలు, డీజిల్‌, రిపేర్లు, ఇతర అభివృద్ధి పనులకు వినియో గిస్తున్నారు.

గడువులోగా పూర్తి చేస్తాం..

మానుకోట మున్సిపాలిటీలో 65శాతం ఇంటి పన్నుల వసూళ్లు పూర్తి అయ్యింది. గడువులోగా వందశాతం వసూళ్లు చేస్తాం. సిబ్బంది ప్రతీరోజు ఇంటింటికీ తిరిగి పన్నుల వసూలు చేస్తున్నారు. ప్రజలు పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి.

– నోముల రవీందర్‌,

మానుకోట మున్సిపల్‌ కమిషనర్‌

మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లలో జాప్యం

65శాతం దాటని ఇంటి పన్ను వసూళ్లు

మిగిలింది 20 రోజులు మాత్రమే..

వందశాతం పూర్తి చేయాలని

ఉన్నతాధికారుల ఆదేశం

నాలుగు మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను వసూళ్ల వివరాలు

మున్సిపాలిటీ డిమాండ్‌ వసూలైంది శాతం

మానుకోట రూ.5.28 కోట్లు రూ. 3.40 కోట్లు 65

తొర్రూరు రూ.3.22 కోట్లు రూ. 2 కోట్లు 62

డోర్నకల్‌ రూ.1.26 కోట్లు రూ. 71.86 కోట్లు 59

మరిపెడ రూ.1.60 కోట్లు రూ. 95 లక్షలు 58

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement