పైన ఫొటోలో వరి పంటలో పశువులను మేపుతున్న రైతు పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన కాలేరు వీరభద్రస్వామి. తనకున్న మూడు ఎకరాల్లో మొక్కజొన్న, నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. ఎకరాకు రూ. 25వేల చొప్పున పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాలకు రూ.లక్ష ఖర్చు పెట్టాడు. ఎకరా మొక్కజొన్నకు సైతం రూ. 20 వేల చొప్పున రూ. 60 వేలు పెట్టుబడి పెట్టాడు.. సాగు చేస్తున్న సమయంలో పుష్కలంగా నీళ్లు ఉండటంతో పంటలు వేశాడు. ప్రస్తుతం పెరుగుతున్న ఎండల తీవ్రతతో బోరు ఎండిపోయి నీటి లభ్యత తగ్గింది. దీంతో ఎండిపోయిన వరిని పశువులతో మేపుతున్నాడు. పంటచేతికి వస్తే అప్పులు తీర్చుతామని ఆశపడితే.. పంటపోగా పెట్టుబడి రూ.1.60లక్షలు అదనంగా అప్పు అయ్యిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.