నర్సింహులపేట: వరిలో నేరుగా వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడులు వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ ఽఅధికారి విజయనిర్మల అన్నారు. గురువారం మండలంలోని పెద్దనాగారంలో నేరుగా వెదజల్లే వరి, మొక్కజొన్న, బీరసాగు, వేరుశనగ పంటలను ఆమె సందర్శించి పరిశీలించారు. వెదజల్లే పద్ధతితో కూలీల సమస్యను అధికమించ వచ్చన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా ఫాస్పరస్ సొల్యూబుల్‌లైజింగ్ బ్యాక్టీరియా, సుడోమోనస్ బ్యాక్టిరీయా పోడిని రాయితీపై రైతులకు పంపిణీ చేశారు. వేరుశనగ పంటలో ఊడలు దిగే సమయానికి జిప్సమ్ వాడటం వలన అధిక దిగుబడులు వస్తాయని డీఏఓ అన్నారు. పంటలపై చీడపీడల నివారణకు తీసుకునే చర్యలను వివరించారు. రైతులకు ఏ సమస్య ఉన్న స్థానిక రైతువేదికలో అగ్రికల్చర్ సిబ్బందిని కలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ వినయ్‌కుమార్, ఏఈఓ బాబు, రైతులు పాల్గొన్నారు.
రైతులను మోసగిస్తే కఠిన చర్యలు
పెద్దవంగర: రైతులను మోసగిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పర్టిలైజర్ షాపులను స్థానిక వ్యవసాయాధికారి స్వామి నాయక్‌తో కలిసి సందర్శించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విజయ నిర్మల మాట్లాడారు. లైసెన్స్‌లు ఉన్న షాపుల్లోనే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహా వ్యవసాయ సంచాలకులు విజయచంద్ర, ఏఈఓ గడల రాజు, తదితరులు పాల్గొన్నారు.