● సీపీఆర్ చేసి బతికించిన
యువకుడు
కురవి: సీరోలు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రమాదవశాత్తు వానరానికి బుధవారం విద్యుత్ షాక్ తగిలి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. కాగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న అదే గ్రామానికి చెందిన యువకుడు అడిగె నాగరాజు సమయస్ఫూర్తితో వానరానికి సీపీఆర్ చేశాడు. కాసేపటి తర్వాత వానరం లేచింది. కాగా సీపీఆర్ చేసి వానరాన్ని బతికించిన నాగరాజును గ్రామస్తులు, పోలీసులు అభినందించారు.