కర్నూలు–బళ్లారి రహదారిపై తారు వేయని రోడ్డు
ఆలూరు రూరల్: ఆలూరు మీదుగా వెళ్లే కర్నూలు–బళ్లారి ప్రధాన రహదారి దెబ్బతిని గుంతల మయంగా మారింది. రోడ్డు మరమ్మతుల్లో భాగంగా అధికారులు మూడు నెలల క్రితం అర కిలో మీటరు దూరం వరకు గుంతలు పూడ్చి కంకర పరిచారు. ఇప్పటి వరకు తారు వేయకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రోజు ఆలూరు మీదుగా కర్నూలు నుంచి బళ్లారికి వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనాల రాకపోకల సమయంలో దుమ్ము,ధూళి రేగుతుండటంతో వాహనదారులు ముఖ్యంగా బైకర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కంకర పరచడంతో బైక్‌లు అదుపుతప్పి కింద పడుతుండటంతో వాహనదారులు గాయాలపాలవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


