కోవెలకుంట్ల: పట్టణ శివారులోని రైల్వేస్టేషన్ రోడ్‌లో గురువారం గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. కోవెలకుంట్ల ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల్లోపు వయస్సు కలిగిన వ్యక్తి ఉదయం 10 గంటల సమయంలో అతిగా మద్యం సేవించి ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించాడు. ఎక్కువగా మద్యం తాగడం వల్ల ఎండతీవ్రత కారణంగా బెట్టకు గురై మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9121101173, 9121101174కు సమాచారం అందించాలని పేర్కొన్నారు.


