కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ కర్నూలు ఈఈ పోస్టుకు ముగ్గురు డీఈఈలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఈఈగా విధులు నిర్వహిస్తున్న ఎస్.మహేశ్వరరెడ్డి గత ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో పాణ్యం పీఆర్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న నాగిరెడ్డికి ఇన్‌చార్జి ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలో పదోన్నతులకు సంబంధించిన డీపీసీ పూర్తయిన నేపథ్యంలో వివిధ జిల్లాల్లో డీఈఈలుగా విధులు నిర్వహిస్తూ ఈఈలుగా పదోన్నతి పొందనున్న ముగ్గురు ఇక్కడకు ఈఈగా వచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కడపలో పీఆర్ క్వాలిటీ కంట్రోల్ విభాగం డీఈఈ శివసాగర్‌రెడ్డి, జమ్మలమడుగు డీఈఈ రాఘవరెడ్డి, అనంతపురం జిల్లాలో డీఈఈగా పనిచేస్తున్న శ్రీరాములు తమకున్న రాజకీ య, అధికార పరిచయాల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందులో ఒక డీఈఈ మాత్రం జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టును ఎవరు దక్కించుకుంటారో ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనుంది.
దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో విభిన్నప్రతిభావంతుల(దివ్యాంగులు) బ్యాక్‌లా గ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ ఫాతిమా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 27 గ్రూపు –4 పోస్టులు, 11 క్లాస్ –4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలను వెబ్‌సైట్ www.kurnool.a p.gov.in, www.nandyal.ap.gov.in వెబ్‌సైట్‌తో పాటు కార్యాలయ నోటీసు బోర్డులో కూడా ఉంచామన్నారు. వివరాలకు 08518 – 277864 నెంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. అర్హులు ఈ నెల 14వ తేది సాయంత్రం 5 గంటల్లోపు తమ దరఖాస్తులను అందించాలన్నారు. అలాగే ఈ ఏడాది మార్చి 18న ఇచ్చిన ప్రకటనలో సవరణ చేశామన్నాన్నారు. టైపిస్టు పోస్టుకు టైపు రైటింగ్ ఇంగ్లిష్ మరియు తెలుగు హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేకున్నా, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచ్‌లర్ డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నా అర్హులేనన్నారు. టైపిస్టు పోస్టుకు ఉద్యోగం పొందిన వారికి కంప్యూటర్ ప్రొఫెషనరీ టెస్ట్(సీపీటీ) నిర్వహిస్తామన్నారు.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష
ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. గత నెల 25న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పరీక్షలకు జిల్లాలో మొత్తం 21 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,735 మంది విద్యార్థుల్లో 7,202 మంది హాజరు కాగా 6,381 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా స్థాయిలో కమ్మర పవన్ కళ్యాణ్ 117 మార్కులతో ఫస్ట్ ర్యాంకు(రాష్ట్ర స్థాయిలో 195వ ర్యాంకు), మేడం చేతన్‌రెడ్డి 116 మార్కులతో రెండో ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 249వ ర్యాంకు), భాష్యం శశావత్ 116 మార్కులతో తృతీయ ర్యాంకు (రాష్ట్ర స్థాయిలో 252వ ర్యాంకు) సాధించారన్నారు.
అంగన్‌వాడీల నిర్వహణలో అలసత్వం వద్దు
కర్నూలు(అర్బన్): అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని మహి ళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ హెచ్చరించారు. పబ్లిక్ పాజిటివ్ పెర్ఫార్మెన్స్‌లో 62 శాతం నెగిటివిటీ వచ్చిన కోడుమూరు ప్రాజెక్టు పసుపుల –2 అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రిజిస్టర్ల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. అనంతరం పసుపుల 1, 3 కేంద్రాలను కూడా తనిఖీ చేశారు. ఆ యా కేంద్రాల్లోని రిమార్కులపై సిబ్బందిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. తప్పులను సరి చేసుకోవడంతో పాటు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు.
ముక్తార్‌బాషాకు
డీఆర్‌ఓగా పదోన్నతి
రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని ఆలమూరు సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ముక్తార్‌బాషాకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌గా పదోన్నతి లభించింది. రుద్రవరం రేంజిలో గత నాలుగేళ్లుగా ఆయన సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పదోన్నతిపై కడప డివిజన్ సిద్దవటం అటవీ క్షేత్రానికి బదిలీ చేశారు.


