10వ తరగతి ఫలితాల్లో 566 మార్కుల సాధనకు సాక్షి పత్రిక అందించిన మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. ప్రతి సబ్జెక్టు సరళమైన రీతిలో, త్వరగా అర్థం చేసుకునేలా ఉంది. నేను అన్ని సబ్జెక్టులు పూర్తిగా చదివాను. పలు ప్రశ్నలకు సంబంధించిన డౌట్స్ మా సారొళ్లు చెప్పారు. వారి ప్రోత్సాహం మరువలేనిది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మాలాంటి పేద విద్యార్థులు మెటీరియల్ అందించి మంచి మార్కులు సాధించడానికి దోహదపడిన సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు. – మనోహర్, పాములపాడు జెడ్పీ పాఠశాల విద్యార్థి


