● జిల్లాలో 16 పరీక్ష కేంద్రాల్లో
పరీక్ష నిర్వహణ
కర్నూలు సిటీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను ప్రశాంతంగా నిర్వహించారు. ఎన్‌టీఏ నిబంధనలను అనుసరిస్తూ విద్యార్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 16 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష జరిగింది. మొత్తం 4,928 మంది విద్యార్థులకు గాను 4,807 మంది (97.54శాతం ) హాజరు కాగా 121 మంది గైర్హాజరయ్యారు. ఎన్‌టీఏ నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వెలుపల విద్యార్థులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేశారు. రాయలసీమ యూనివర్సిటీలోని కేంద్రం వద్ద పోలీసుబంద్‌బస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన నీట్ కేంద్రాలను జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరీక్షలు సజావుగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగాయన్నారు.


