● ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి
హాలహర్వి: గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి చంద్రబాబు ప్రభుత్వానికి కనిపించదా అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ప్రశ్నించారు. హాలహర్విలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మండలంలోని మల్లికార్జునపల్లి, నిట్రవట్టి, కొక్కరచేడు, శ్రీధర్‌హాల్, సిద్ధాపురం, సిరుగాపురం గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించలేదన్నారు. కొత్త పింఛన్ల ఊసే కరువైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలిపారు. వైఎస్సార్‌సీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి శశికళ, మండల కన్వీనర్ రామిరెడ్డి, జిల్లా కార్యదర్శి అర్ధగేరి శ్రీనివాసులు, కో కన్వీనర్లు మల్లికార్జున, ఉసేని, మండల కార్యదర్శి గోపాల్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.


