● కడప సెంట్రల్ జైలుకు తరలించిన
ఎకై ్సజ్ అధికారులు
కర్నూలు: నాటుసారా దొంగచాటుగా తయారుచేసి వ్యాపారం చేస్తున్న ఇద్దరిపై ఎకై ్సజ్ అధికారులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. పత్తికొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మద్దికెర గ్రామానికి చెందిన సాతుపాటి కృష్ణ, కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కల్లూరు మండలం కొల్లంపల్లి తండా వాసి తెలుగు రామదాసులపై పీడీ చట్టం ప్రయోగించేందుకు ఎకై ్సజ్ అధికారులు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదించారు. ఈ మేరకు నిర్బంధ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి జారీ చేశారు. నాలుగు నెలల వ్యవధిలో సాతుపాటి కృష్ణ, తెలుగు రామదాసుపై నాలుగు చొప్పున సారా రవాణా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇద్దరినీ కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు తెలిపారు. నాటుసారా రవాణా, విక్రయాలు మానేస్తే మెప్మా, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంక్షేమ విభాగాలతో సమన్వయం చేసి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ పోతుల శ్రీదేవి తెలిపారు. పాత నేరస్తులు సారా వృత్తిని మాని ప్రత్యామ్నాయ ఉపాధి ద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాల్సిందిగా ఆమె సూచించారు. దొంగచాటుగా వ్యాపారం సాగిస్తున్న మరికొంతమందిపై పీడీ చట్టం ప్రయోగించేందుకు జాబితా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
తెలుగు రామదాసు
సాతుపాటి కృష్ణ


