జిల్లావ్యాప్తంగా మెగా కార్డెన్‌ సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లావ్యాప్తంగా మెగా కార్డెన్‌ సెర్చ్‌

May 3 2026 7:47 AM | Updated on May 3 2026 7:47 AM

కర్నూలు: ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా శనివారం మెగా కార్డ్డెన్‌ సెర్చ్‌ (నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. పోలీస్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవనకొండ మండలం కప్పట్రాళ్ల, ఎమ్మిగనూరు సబ్‌డివిజన్‌లోని లచ్చుమర్రి, ఆదోని సబ్‌ డివిజన్‌లోని కపటి, కర్నూలులోని జొహరాపురం, ఇందిరమ్మ హౌసింగ్‌ కాలనీలోని అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. మొత్తం 165 వాహనాలను తనిఖీ చేసి 53 వాహనాలకు పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకొని స్టేషన్లకు తరలించారు.పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సమాచారం ఉంటే ఏపీ ఈగల్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌: 1972కు సమాచారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement
 
Advertisement
Advertisement