‘ఉపాధి’ అక్రమాలపై విచారణ | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ అక్రమాలపై విచారణ

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

కౌతాళం: అక్రమార్కులకు ‘ఉపాధి’ అన్న శీర్షిక ఏప్రిల్‌ 30న గురువారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కౌతాళం మండలంలోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ నిధులు కొల్లగొట్టిన తీరుపై శుక్రవారం ఆదోని డివిజన్‌ ఏపీడీ లోకేశ్వర విచారణ చేపట్టారు. కౌతాళం ఎంపీడీఓ కార్యాలయంలో వివరాలు సేకరించారు. ఎంబుక్‌ లేకుండా పనిచేయని 98 పనులకు చెక్‌ మెజర్‌మెంట్‌ చేయడంపై ఏపీడీని వివరణ కోరారు. ఎంబుక్‌ లేనివి ఎంపీడీఓతో డీలిట్‌ చేసినట్లు ఎంబుక్‌ ఉన్న వాటికి మాత్రమే బిల్లులు చేసినట్లు ఈసీ వ్యక్తిగతంగా హజరై రాతపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు ఏపీడీ తెలిపారు.

నీట్‌ సందేహాల నివృత్తికి హెల్ప్‌డెస్క్‌

కర్నూలు(సెంట్రల్‌): ఈనెల 3న నిర్వహించనున్న నీట్‌ ప్రవేశ పరీక్షకు సంబంధించి సందేహాలు, సలహాల కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి సందేహాలున్నా 08518–277305 నంబర్‌కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు.

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం జరిగిన డిగ్రీ నాల్గవ సెమిస్టర్‌ పరీక్షల్లో 95 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు చూచి రాతలకు పాల్పడగా డిబార్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement