మతసామరస్యానికి ప్రతీకలు దర్గాలు | - | Sakshi
Sakshi News home page

మతసామరస్యానికి ప్రతీకలు దర్గాలు

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

ఖాదర్‌లింగస్వామి సన్నిధిలో

కాటిగి పీఠాధిపతి

కౌతాళం: మతసామరస్యాలకు దర్గాలు ప్రతీకలుగా నిలుస్తాయని కర్ణాటక రాష్ట్రంలోని కాటిగి తలెకాన మఠం పీఠాధిపతి వీరభద్రస్వామి అన్నారు. కౌతాళంలో జగద్గురు ఖాదర్‌లింగస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ధర్మకర్త మున్నపాషా చిష్తీ, పీఠాదిపతి ఖాదర్‌బాష చిస్తీలు స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనంతరం శాలువ పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి వీరభద్రస్వామి మాట్లాడుతూ ప్రజలు కులమతాలకు అతీతంగా ఖాదర్‌లింగస్వామిని దర్శించుకుంటున్నారన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దర్గాలో పంచాంగ పఠనం చేస్తున్నారన్నారు. ఇలాంటి సంప్రదాయాలు అన్ని చోట్ల ఉండటం ఎంతో అవసరం అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement