బేతంచెర్ల: పట్టణంలోని నగర పంచాయతీ సమీపాన ఉన్న మహబూబ్ హోటల్లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్టు సర్క్యూట్ జరిగి రూ. 2.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన హోటల్ నిర్వాహకు డు రసూల్‌గురువారం రాత్రి 11 గంటల సమ యంలో హోటల్ బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున హోటల్లో నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికు లు వెంటనే ఆయనకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వెళ్లి చూడగా హోటల్లోని ఫ్రిజ్ లో షార్టు సర్క్యూట్ జరిగి పక్కనే ఉన్న వంట సామగ్రి, కుర్చీలు, టేబుల్స్, 15 వేల నగదు, బియ్యం బస్తాలు, మిక్సి, గ్రైండర్ కాలిపోయా యి. సుమారు రూ. 2.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. గ్యాస్ సిలిండర్ల దగ్గరకు మంటలు వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
పట్టీ రాయించాడు.. సరుకులు పట్టుకెళ్లాడు
మద్దికెర: మోసానికి కాదేది అనర్హం అంటున్నా రు కొందరు కేటుగాళ్లు. ఎదుటివాడికి ఎలాంటి అనుమానం కలగకుండా మాయమాటల తో నమ్మించి చీటింగ్ చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొందరు వారి వలలో పడి లబోదిబోమంటున్నారు. తాజాగా మద్దికెరలో ని ఓ దుకాణాదారుడికి కేటుగాడు రూ. 40వేలు టోకరా వేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు.. గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మద్దికెరలోని ఓ కిరాణ దుకాణానికి వచ్చాడు. దాదాపు రూ. 1.50 లక్షలు విలువ చేసే సరుకుల పట్టీ రా యించాడు. వ్యాపారి ఆ పట్టీ ప్రకారం సరుకు లు ప్యాక్ చేసి పెట్టారు. అందులో దాదాపు రూ.40 వేలు విలువ చేసే సిగరెట్లు ప్రత్యేకంగా ప్యాక్ చేయించుకున్నాడు. ఆటో తీసుకొచ్చి డ బ్బులు చెల్లించి సరుకులు తీసుకెళ్తానని నమ్మించి సిగరెట్లు వెంట పట్టుకెళ్లాడు. రాత్రయినా రాకపోవడంతో మోసపోయానని గమనించి లబోదిబోమనడం దుకాణాదారుడి వంతైంది.
పతకాలు సాధించాలి
కర్నూలు (టౌన్) : అథ్లెటిక్స్‌లో జిల్లాకు పతకాలు తీసుకురావాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. శుక్ర వారం స్థానిక బి. క్యాంపు క్రీడా మైదానంలో ఉ మ్మడి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు.పోటీలను ప్రారంభించిన ఆయన ఎంపిక పోటీల్లో రాణించిన క్రీడాకారులు ఈనెల 5 వ తేదీ గుంటూరు నాగర్జున యూనివర్సీటీ క్రీడా మైదానంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో విక్టర్, పీడీలు లక్ష్మయ్య, అథ్లెటిక్స్ కోచ్ కాశీరావు, జనార్దన్, మల్లేష్ పాల్గొన్నారు.
గడ్డివాములు దగ్ధం
నందవరం: మండల పరిధిలోని హెచ్.బాపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. బోయ మునెప్ప గారి రామన్న అనే రైతు తన వాముదొడ్డిలో రెండు గడ్డి వాములు వేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి గడ్డివాముల నుంచి మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి రైతుకు స మాచారం అందించారు. ఆర్పేందుకు ప్రయత్నించేలోపు అవి పూర్తిగా కాలిపోవడంతో దాదాపు రూ.70 వేలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని ఆయన కోరారు.
చిన్న నేలటూర్‌లో ..
గోనెగండ్ల: మండల పరిధిలోని చిన్ననేలటూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతోనే ఇలా జరిగిందని బాధిత రైతు ఈడిగ లక్ష్మన్న వాపోయాడు. గడ్డి వాముల దగ్ధంతో బాధితుడికి రూ. 1.50 లక్షలు నష్టం వాటిల్లింది.
ఆదోని సెంట్రల్: ఆదోని రైల్వేస్టేషన్ పరిధిలోని కుప్పగల్–కోసిగి రైల్వేస్టేషన్ మధ్యలో కి.మీ.నంబర్ 516/17–19 అప్ ట్రాక్ మధ్యలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని ఆదోని రైల్వే పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సి.శివరామయ్య తెలిపారు. ఆదోని రైల్వే స్టేషన్ మాస్టర్ వెంకటేశ్వర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఎడమచేతికి చక్రం ఆకారంలో పచ్చబొట్టు ఉందని, నలుపు రంగు లోయర్, బ్లూ రంగు ఫుల్ డ్రాయర్, కాఫీ కలర్ టీ షర్ట్ ధరించాడని చెప్పారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


