అనుమతులు లేని విత్తనాలు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

అనుమతులు లేని విత్తనాలు సీజ్‌

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

అనుమతులు లేని విత్తనాలు సీజ్‌

ఎమ్మిగనూరురూరల్‌: పట్టణంలోని శ్రీసాయిరాం సీడ్స్‌ అండ్‌ పెస్టిసైడ్స్‌ దుకాణంలో శుక్రవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమిషనరేట్‌ సహాయ సంచాలకుడు ప్రవీణ్‌, ఏఓ మోహన్‌, ఏడీఏ మహమ్మద్‌ఖాద్రి, ఏఓ శివశంకర్‌ బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. ఎటువంటి అనుమతి లేకుండా విక్రయించేందుకు సిద్ధం చేసిన రూ. 25,35,142 విలువైన 2,482 విత్తన ప్యాకెట్లు, రూ. 1,91,000 విలువ చేసే బయో మందులను సీజ్‌ చేశారు. మొత్తం రూ. 27,26,142 విలువైన విత్తనాలు, బయో మందుల అమ్మకాలను నిలిపివేశారు. అనంతరం శ్రీ మైత్రీ ఆగ్రోస్‌ ఏజెన్సీ, చంద్ర ట్రేడర్స్‌లోనూ వారు విత్తనాలను తనిఖీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement