యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

May 2 2026 8:14 AM | Updated on May 2 2026 8:14 AM

పెద్దకడబూరు : బాపులదొడ్డి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ మారుతి వివరాల మేరకు.. బాపులదొడ్డికి చెందిన గిడ్డగాని వీరారెడ్డి(43) కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీనికితోడు కొన్ని రోజులుగా భార్య పుట్టింటికి పోయి కాపురానికి రాలేదు. మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది గతనెల 29వ తేదీన(బుధవారం) ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కల్లులో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement