వేసవికాలం ప్రారంభం నుంచి పశ్చిమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి. అధికారులు, పాలకులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తాగునీటిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు వదులుకొని కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బోరుబావుల నుంచి నీళ్లు తెచ్చుకొని గొంతుతడుపుకుంటున్నారు. నందవరం మండలం ఇబ్రహీంపురం గ్రామంలో మంచినీటి పథకాలు సక్రమంగా పనిచేయకపోవడంతో మండుటెండలో మహిళలు, చిన్నారులు తోపుడుబండ్లు తీసుకెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. తాగునీటి సమస్య తీవ్రతకు అద్దంపట్టే ఈ దృశ్యాలు చూసైనా అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
–నందవరం


