కౌతాళం: కౌతాళంలో మతసామరస్యానికి ప్రతీకగా వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సఫ్‌రాలుట్‌న (ప్రసాదం పంపిణీ) కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చీష్తీ ఇంట్లో మట్టి కుండల్లో ప్రత్యేంగా తయారు చేసిన తీపి పదార్థాన్ని డప్పువాయిద్యాలు, బ్యాండుమేళాల మధ్య దర్గాకు తీసుకొచ్చి ప్రత్యేక ఫాతెహాలు సమర్పించారు. అనంతరం ధర్మకర్త ప్రసాదం పంపిణీ ప్రారంభించడంతో భక్తులు ఎగబడ్డారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండ సీఐ యుగంధర్ గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.
దర్గాను దర్శించుకున్న అడిషనల్ ఎస్పీ
జిల్లా అడిషనల్ ఎస్పీ జి.హుసేన్‌పీరా ఫ్యాక్షన్ జోన్ సీఐ పార్థసారథి, కౌతాళం సీఐ యుగంధర్‌తో కలిసి ఖాదర్‌లింగస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ధర్మకర్త మున్నపాషా చిష్తీ, పీఠాధిపతి ఖాదర్‌బాషా చిస్తీలు ఘన స్వాగతం పలికి స్వామి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అనంతరం శాలువ పూలమాలతో సత్కారించి దర్గా ఫొటో అందజేశారు.
కొనసాగుతున్న కౌతాళం దర్గా ఉత్సవాలు


