మనోజ్‌ కుటుంబానికి అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

మనోజ్‌ కుటుంబానికి అండగా ఉంటాం

May 1 2026 6:03 AM | Updated on May 1 2026 6:03 AM

వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా

అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

ఓర్వకల్లు: తిరుణాల సందర్భంగా ఉయ్యాలవాడ గ్రామంలో హత్యకు గురైన వడ్డె మనోజ్‌కుమార్‌ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. వారం రోజుల క్రితం దారుణ హత్యకు గురైన మనోజ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులను గురువారం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ మీదివేముల ప్రభాకర్‌రెడ్డితో పాటు కాటసాని పరామర్శించారు. ముందుగా మనోజ్‌ కుమార్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం హత్యకు గల కారణాలను మనోజ్‌ తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, లలితమ్మను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన ఎరుకలి వంశీ, ఆయన కుటుంబ సభ్యులు కలిసి తమ ఇంటివద్దకు వచ్చి మనోజ్‌ కుమార్‌ను దారుణంగా హత్య చేశారని వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. మనోజ్‌ కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందన్నారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు బొమ్మన నాగేశ్వరెడ్డి, రామిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, పల్లె మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ మాదన్న, నాగరాజు, శివశంకర్‌రెడ్డి, డీలర్‌ నారాయణ, వెంకటరాముడు, గాజుల లక్ష్మినారాయణ, తలారి శివకుమార్‌, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement