కర్నూలు రేంజ్‌ నూతన ఎఫ్‌ఆర్‌ఓగా ప్రియాంక | - | Sakshi
Sakshi News home page

కర్నూలు రేంజ్‌ నూతన ఎఫ్‌ఆర్‌ఓగా ప్రియాంక

Apr 30 2026 8:07 AM | Updated on Apr 30 2026 8:07 AM

కర్నూలు కల్చరల్‌: కర్నూలు రేంజ్‌ నూతన ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌గా బి.ప్రియాంక నియమతులయ్యారు. ఆమె బుధవారం రేంజ్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2013లో ఎఫ్‌ఆర్‌వోగా ఎంపికై న ఆమె ప్రొద్దుటూరులో ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత నంద్యాల, తిరుపతి, పీలేరు రేంజ్‌లలో విధులు నిర్వహించారు. కర్నూలు రేంజ్‌ ఇన్‌ఛార్జి ఎఫ్‌ఆర్‌వో తేజస్వి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆమె కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బీవీఏ కృష్ణమూర్తి, డీఎఫ్‌వో పి.శ్యామలను మర్యాదపూర్వకంగా కలిశారు. అందరి సహకారంతో అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తానన్నారు.

1న ఉమ్మడి జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు

కర్నూలు(టౌన్‌): స్థానిక బి.క్యాంపు క్రీడా మైదానంలో మే 1వ తేదీన ఉమ్మడి జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కె.సుబ్బరత్నాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు మే 5, 6 తేదీలలో గుంటూరులోని నాగార్జున యూనివర్సీటీ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు లక్ష్మయ్య(89194 09232)ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement