మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో బుధవారం భక్తుల మధ్య శ్రీ మఠం ప్రాంగణంలో వెండి రథంపై ప్రహ్లాదరాయలు విహరించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు నేతృత్వంలో నిత్యపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా గ్రామదేవత మంచాలమ్మకు కుంకుమార్చన గావించారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి, విశేష పంచామృతాభిషేకం నిర్వహించి మంగళహారతులు ఇచ్చారు. శ్రీమఠం కారిడార్‌లో భక్తుల రద్దీ, కల్పతరు క్యూ కాంపెక్స్‌లో, పరిమళ ప్రసాదం కౌంటర్లలో, అన్నపూర్ణ భోజనశాల దగ్గర భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీమఠంలో ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు కోసం కారిడార్‌లో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆదేశాలతో శ్రీమఠం అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక అలంకరణలో గ్రామదేవత మంచాలమ్మ, చలువ పందిట్లో సేదతీరుతున్న భక్తులు


