గుడిసైపెకి దూసుకెళ్లిన లారీ | - | Sakshi
Sakshi News home page

గుడిసైపెకి దూసుకెళ్లిన లారీ

Apr 30 2026 8:07 AM | Updated on Apr 30 2026 8:07 AM

● వృద్ధురాలి దుర్మరణం

● వృద్ధురాలి దుర్మరణం

బొమ్మలసత్రం: నంద్యాల శివారులోని చి న్న చెరువుకట్టపై ఐఛర్‌ లారీ అదుపుతప్పి గుడిసైపెకి దూసుకెళ్లడంతో సుంకమ్మ (83) అనే వృద్ధురాలు మంగళవారం మృతిచెందింది. ట్రాఫిక్‌ సీఐ చాంద్‌బాషా తెలిపిన వివరాల మేరకు.. వేకువజామున బియ్యంలోడ్‌తో వస్తున్న ఐఛర్‌ వాహనం చెరువుకట్టపై వస్తుండగా అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న గుడిసైపెకి దూసుకెళ్లింది. గుడిసెలో నిద్రిస్తున్న సుంకమ్మను ఢీకొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement