లోతుగా విచారణ చేస్తున్నాం
సీఐని సరెండర్ చేశాం
ఇదంతా కుట్ర..
డోన్: మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులే కాసులకు కక్కుర్తి పడ్డారు. పట్టుబడిన మద్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మూడో కంట పడకుండా సరుకు ఊరు దాటించాలనుకుని చివరకు పోలీసులకు చిక్కడంతో కిక్కు దిగి దిక్కులు చూస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు లోలోపల మల్లగుల్లాలు పడుతున్నారు. ఈనెల 26వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో చాకిరేవుమిట్ట వద్ద డోన్ అర్బన్ సీఐ ఇంతియాజ్ బాషా, ఎస్‌ఐ శరత్‌కుమార్ రెడ్డి వాహనాల తనిఖీ చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం పట్టుబడింది. అయితే పోలీసుల విచారణలో అందరూ అవాక్కయ్యే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న 379 కర్ణాటక మద్యం సీసాలు ఒక కేసులో ఎకై ్సజ్ పోలీసులు సీజ్ చేసినవిగా గుర్తించారు. కారులో ఉన్న ప్యాపిలి మండలం పీఆర్ పల్లెకు చెందిన సోమనాథ్‌ను పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ నుంచి కర్ణాటక మద్యాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలిపాడు. స్వయంగా ఉన్నతాధికారుల సమక్షంలోనే ఈ మద్యాన్ని కొనుగోలు చేసిన అనంతరం స్వగ్రామానికి కారులో తరలిస్తున్నట్లు అంగీకరించడంతో పోలీసులు కంగుతిన్నారు. వెంటనే సమాచారం ఉన్నతాధికారులకు చేరడంతో విచారణ వేగవంతం చేశారు.
ఎకై ్సజ్ అధికారుల తీరు వివాదాస్పదం..
టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎకై ్సజ్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. మద్యం షాపుల ఏర్పాటులో వివక్ష చూపడం, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్న వాటిని కూడా మామూళ్లకు కక్కుర్తిపడి పట్టణంలో ఏర్పాటు చేయించడం చర్చనీయాంశమైంది. గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలను కూడా పట్టణంలోనే రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఏర్పాటు చేయించడం కూడా వివాదాస్పదంగా మారింది. నెలనెలా మామూ ళ్లు దండుకుంటూ ఎమ్మెల్యే కోట్ల వర్గానికి వంత పాడుతూ తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని అధికార పార్టీ అసమ్మతి నేత, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి వర్గీయులు బాహాటంగానే ఆరోపణలు చేసిన సంగతి విధితమే. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలు ఒక్కో బెల్టుషాపునకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసి గ్రామంలో 3 నుంచి 10 బెల్టుషాపుల వరకు ఏర్పాటు చేయించారు. ఎకై ్సజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మద్యం తరలిస్తూ డోన్ అర్బన్ పోలీసులకు పట్టుపడిన కారు
ఉన్నతాధికారులను తప్పించే యత్నం..
సీజ్ చేసిన కర్ణాటక మద్యం ఎకై ్సజ్ స్టేషన్ నుంచి బయటకు ఎలా వచ్చింది, ఎవరి పాత్ర ఉంది అనే విషయా లపై లోతుగా విచారణ చేస్తున్నాం. నిందితుడు ఎకై ్సజ్ ఉన్నతాధికారులపై చేసిన ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉంద నేది విచారణలో బహిర్గతం కానుంది. దోషులు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరు.
– శ్రీనివాసులు, డీఎస్పీ, డోన్
డోన్ ఎకై ్సజ్ సీఐ వరలక్ష్మిపై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నా ం. ఆ మేరకు ఆమెను సరెండర్ చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టాం. ఈ కేసులో ఉన్నతాధికారుల పాత్ర ఉందని తేలితే చర్యలు తప్పవు. – రవికుమార్,
ఎకై ్సజ్ సూపరింటెండెంట్, నంద్యాల జిల్లా
సివిల్, ఎకై ్సజ్ ఉన్నతాధికారుల విచారణలో నిజనిజాలు వెల్లడవుతాయని గట్టిగా విశ్వసిస్తున్నా. ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించేందుకే కొందరు కుట్రపన్నారనిపిస్తోంది. వాస్తవాలు విచారణలో వెల్లడి అయ్యేంత వరకు మాట్లాడటం భావ్యం కాదు.
– వరలక్ష్మి, ఎకై ్సజ్ సీఐ, డోన్


