భూ రీసర్వే పకడ్బందీగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూ రీసర్వే పకడ్బందీగా పూర్తి చేయాలి

Apr 29 2026 7:42 AM | Updated on Apr 29 2026 7:42 AM

● అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ సిరి

● అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ సిరి

ఓర్వకల్లు: ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని, సర్వేకు ముందు ప్రతి రైతుకు నోటీసులు అందజేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని నన్నూరు గ్రామంలో జరుగుతున్న 5వ విడత రీసర్వే ప్రక్రియను జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌తో కలిసి కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో సుమారు 10,542 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న రీ సర్వేను పనులను కలెక్టర్‌ ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ.. రీ సర్వే ప్రక్రియలో పొలం సరిహద్దుల నిర్ధా రణ, భూముల రికార్డుల సమీక్ష, రోవర్‌ సాంకేతిక విధానాల వినియోగం వంటి అంశాలను జాగ్రత్తగా అమలు చేయాలన్నారు. వేసవికాలంలో భూములను ఖాళీగా ఉంచకుండా పీఎండీఎస్‌ పద్ధతిలో వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా భూమి సారవంతం పెరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. కలెక్టర్‌ వెంట కర్నూలు ఆర్డీఓ సందీప్‌కుమార్‌, జిల్లా సర్వే శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే సుబ్బారెడ్డి, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, వీఆర్‌ఓలు, విలేజ్‌ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement