మంత్రాలయం రూరల్ : మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంకు సమీపంలో కర్ణాటక రాష్ట్రం దావణగేరి జిల్లా, కాకారగొల్ల తాలూకా, కె.కొడిహాళ్ళి గ్రామాని చెందిన హాలేశి (49) అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం మృతి చెందాడని ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు. మృతుని దగ్గర ఉన్న నెంబర్ సహాయంతో కుటుంబ సభ్యులకు ఎస్‌ఐ సమాచారం అందించారు. అదే విధంగా మాజీ సర్పంచ్ తెల్ల బండ్ల భీమయ్యకు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని శ్రీమఠం ఆసుపత్రి అంబులెన్స్‌లో తరలించి పంచాయతీ ఫ్రిజర్ బాక్సులో ఉంచే ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు వచ్చాక వారికి అందజేస్తామని తెలిపారు.


