వెండి గంట వితరణ | - | Sakshi
Sakshi News home page

వెండి గంట వితరణ

Apr 29 2026 7:42 AM | Updated on Apr 29 2026 7:42 AM

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

పాణ్యం: మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి భక్తులు వెండి గంటను విరాళంగా అందించినట్లు ఈఓ రామక్రిష్ణ తెలిపారు. వివరాల మేరకు.. వెలుగోడు మండలం పలస రాము, ప్రత్యూష దంపతులు తమ ఇలవేల్పు స్వామి వారికి 30 తులాల వెండితో తయారు చేసిన గంటలను అందించినట్లు తెలిపారు. గంట విలువ రూ.72 వేలు ఉంటుందని వెల్లడించా రు. దాతల కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందించారు. ఆలయ అర్చకులు నారాయణస్వామి, తదితరులు ఉన్నారు.

డోన్‌ రూరల్‌: పట్టణ సమీపంలోని రైలు పట్టాల వద్ద సుమారు 70 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం డోన్‌–దొరపల్లె మధ్య, డోన్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఒక కిలోమీటర్‌ దూరంలో ట్రాక్‌కు పక్కన 10 మీటర్ల దూరంలో మృతదేహం పడి ఉందని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడు నలుపు రంగు ష్టర్‌ ధరించి, 5‘5‘ అడుగుల ఎత్తు, నలుపు వర్ణం, తల, గడ్డంపై అంగుళం మేర తెల్లటి వెంట్రుకలు ఉన్నాయని తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 92475 75608 శ్రీనాథ్‌ రెడ్డి రైల్వే సీఐ, కర్నూల్‌ లేదా 92475 75610 బిందుమాధవి రైల్వే ఎస్‌ఐ, డోన్‌ నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

బనగానపల్లె: మండలంలోని నందివర్గం పోలీ సు స్టేషన్‌ పరిధిలోని నందవరం గ్రామానికి చెందిన షేక్‌ మహాబూబ్‌ హుస్సేన్‌ (32) సోమ వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ భూపాలుడు మంగళవారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. షేక్‌ మహబూబ్‌ హుస్సేన్‌ బనగానపల్లెలోని భారత్‌ గ్యాస్‌లో పని చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం మద్యం సేవించి ఇంటి నుంచి బైక్‌పై బనగానపల్లెకు వెళుతుండగా బైక్‌ అదుపు తప్పడంలో తీవ్రగాయాలపాలై ఆపస్మారక స్థితిలో రహదారి పక్కలో పడ్డాడు. ప్రమాదం జరిగిన విషయం ఎవరూ గుర్తించలే దు. దీనికి తోడు ఎండ తీవ్రత అధికం కావడంతో అక్కడిక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బన గానపల్లె ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కర్ణాటకలో

హొళగుంద వాసి హత్య

హొళగుంద: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలో దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఈ నెల మొదటి వారం నుంచి కనిపించకుండా పోయాడు. దీనిపై హొళగుంద పోలీస్‌ స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైనటు్‌ల్‌ సమాచారం. ఈ స్థితిలో సోమవారం కంప్లీ తాలూకా సమీపంలోని దరోజి అనే ప్రాంతం వద్ద నిర్మానుష్య ప్రాంతంలో అతని మృతదేహం లభ్యమైనట్లు తెలిసింది. మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో పడి ఉన్న తీరును బట్టి దాదాపు 20 రోజుల క్రితమే హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హొళగుంద పోలీసులు దీనిపై విచారణ చేపట్టగా త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement