కౌతాళం: మతసామ ర స్యానికి ప్రతీకగా కౌతాళంలో వెలసిన జగద్గురు ఖా దర్‌లింగ స్వామి 322వ ఉరుసు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. ప్రత్యేక ఫాతేహా ల అనంతరం స్వామి సమాధిని సుగంధ ద్రవ్య లు, పానీయాల తో శుభ్రం చేశారు. దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా వుసేని చిష్తీ, పీఠాధిపతి సయ్యద్ ఖాదర్‌బాష చిష్తీ, వారి శిష్యరిక బృందం స్వామివారి సమాధిని శుభ్రం చేశారు. ప్రత్యేకంగా తెచ్చిన చద్దర్‌ను స్వామి సమాధిపై వేసి పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఫాతెహాలు నిర్వహించి నగార వాయించారు. ఖాదర్‌లింగస్వామి శిష్యులు, గ్రామ ప్రముఖులు, వే లాదిగా భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయని ధర్మకర్త తెలిపారు. గుల్షన్ కమిటీ అధ్యక్షుడు మున్నపాషా తదితరులు పాల్గొన్నా రు. ఉరుసు సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. నేడు గంధం కార్యక్రమం, గురువారం ఉరుసు ఉత్సవం ఉంటుందని ధర్మకర్త తెలిపారు.
బాలిక అదృశ్యం
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని మాధవరం గ్రా మానికి చెందిన షేక్‌నూర్ బాషా, షేక్ యాస్మీన్‌ల కూమార్తె షేక్ సమీనా (17) సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి కనుబడుటలేదని ఎస్ విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన తెలి పిన వివరాల మేరకు.. షేక్ నూర్ బాషాకు ఇద్దరు కుమారులు, ఇద్దరూ కుమార్తెలు సంతానం. వీరు హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి పెద్ద కుమార్తె షేక్ సమీనా (17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల వచ్చిన రిజల్ట్స్‌లో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అ య్యింది. కాగా,కూతురు ఎక్కువగా ట్యాబ్ చూస్తుండటంతో తల్లి మందలించినది.దీంతో సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోంది. తిరిగి ఇంటికి రాలేదని,ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదని ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.


