కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీకి మెరుగైన న్యాక్ ర్యాంకింగ్ సాధించేలా కృషి చేయా లని వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఉద్యోగులకు సూచించారు. వర్సిటీ సెనేట్ హాల్‌లో ఐక్యూఏసీ ఆధ్వర్యంలో న్యాక్ ర్యాంకింగ్ సాధనకు సంబంధించి గత రెండు రోజులుగా జరుగుతున్న సమీక్షా సమావేశంలో వీసీ పాల్గొని దిశానిర్దేశం చేశా రు.వర్సిటీ అభివృద్ధి, వసతులు, నైపుణ్యాభివృద్ధి కా ర్యక్రమాలు, అధ్యాపకుల శిక్షణ, వివిధ కంపెనీలతో చేసుకున్న అవగాహన ఒప్పందాలు, తదితర అంశాలపై సమగ్రంగా నివేదికలు తయారు చేయాలన్నారు. ప్రొఫెసర్ పాల్ క్లీ, ప్రొఫెసర్ రవిచందన్ కంచర్ల న్యాక్ కమిటీల రూపకల్పన గురించి వివరించారు. రెక్టార్ ఎన్‌టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్‌కుమార్ నాయుడు, ప్రిన్సిపాళ్లు సి.విశ్వనాథ రెడ్డి, సుందరానంద పుచ్చ, అకడమిక్ అఫైర్స్ డీన్ సీవీ కృష్ణారెడ్డి, ఎగ్జామినేషన్స్ డీన్ ఎన్.నరసింహులు, ఐక్యూఏసీ డైరెక్టర్ భరత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


