ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇంధన కొరత | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇంధన కొరత

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

చిప్పగిరి: రాష్ట్రంలో ఇంధన కొరతకు పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పెట్రోలు, డీజిల్‌ కోసం వాహనదారులు బారులు తీరుతున్నారన్నారు. రాష్ట్రంలో 70 శాతానికి పైగా పెట్రోల్‌ బంకులు మూతపడితే ప్రజల ఆందోళన వల్లే ఇంధన కొరత ఏర్పడిందని మంత్రి నాదెండ్ల చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల అవసరాలకు సరిపడా ఆయిల్‌ దిగుమతులు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. దేశంలో ఎక్కడా లేని ఇంధన కొరత మన రాష్ట్రంలో ఎందుకు వచ్చిందో ప్రజలకు చెప్పాలన్నారు. పెట్రోలు, డీజిల్‌ కొరతతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. విలేకరుల సమావేశంలో బుసినే చంద్రశేఖర్‌ శ్రీరాములు, వెంకటేష్‌, మహానంది, హనుంతు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement