వేలం పాటలో తగ్గిన ఆదాయం | - | Sakshi
Sakshi News home page

వేలం పాటలో తగ్గిన ఆదాయం

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

కౌతాళం: వేలం పాటల్లో కౌతాళం మేజర్‌ పంచాయతీ ఆదాయం తగ్గింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదాల అనంతరం సోమవారం ఎంపీడీఓ స్వర్ణలత ఆధ్వర్యంలో బండిమెట్ట వేలం పాట నిర్వహించారు. బొగటమ్మ రూ.8,15,000లకు పాటను దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.11,75,000కు వేలం పోయింది. గతేడాదితో పోలిస్తే పంచాయతీకి సుమారు రూ.3.60 లక్షల ఆదాయం తగ్గింది. కాగా, ఈనెల 10వ తేదిన బండిమెట్టతో పాటు ఇతర వాటికి వేలం పాట నిర్వహించారు. బండిమెట్ట వేలం పాటను రూ.17,27,000 పోగా.. డబ్బులు వెంటనే కట్టలేదన్న సాకుతో కూటమి నేతలు వేలం పాటను వాయిదా వేయించారు. సోమవారం జరిగిన వేలం పాటలో బండిమెట్టను గతేడాది కన్న తక్కువ పాడి దిక్కంచుకోవడం విశేషం. కార్యక్రమంలో కార్యదర్శి యోగేశ్వరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. సీఐ యుగంధర్‌ పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement