హత్యకేసు నిందితులను జిల్లా బహిష్కరణ చేయాలి | - | Sakshi
Sakshi News home page

హత్యకేసు నిందితులను జిల్లా బహిష్కరణ చేయాలి

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

ఎదుర్కోల్లు నిర్వహిస్తున్న దృశ్యం

కర్నూలు(సెంట్రల్‌): ఓర్వకల్‌ మండలం ఉయ్యాలవాడకు చెందిన వడ్డె మనోజ్‌కుమార్‌ (23)ను దారుణంగా హత్య చేసిన నిందితులు ఎరుకలి వంశీ, అతని తల్లిదండ్రులు, బంధువులను జిల్లా బహిష్కరణ చేయాలని కర్నూలు జిల్లా వడ్డెరాజుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్‌బండ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వడ్డె మనోజ్‌కుమార్‌కు 45 రోజుల క్రితమే పెళ్లి అయ్యిందని, ఇంతలోనే అతన్ని హత్య చేయడంతో భార్య వెంకటేశ్వరి తీవ్ర దుఃఖంలో ఉండిపోయిందన్నారు. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మరోవైపు నిందితుల్లో వెంకటలక్ష్మీ వీఆర్వోగా, శ్రీరాములు లైన్‌మన్‌గా పనిచేస్తున్నారని, వారిద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement