ఉన్నత శిఖరానికి చేరువై.. | - | Sakshi
Sakshi News home page

ఉన్నత శిఖరానికి చేరువై..

Apr 28 2026 7:47 AM | Updated on Apr 28 2026 7:47 AM

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ చేరిన

దివ్యాంగురాలు మధు తనూజ

బేతంచెర్ల: ఆర్‌ఎస్‌ రంగాపురం జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న దివ్యాంగురాలు మధు తనూజ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ చేరుకుని అరుదైన ఘనత సాధించింది. వికలాంగుల జిల్లా స్థాయి పోటీల్లో 200 మంది పాల్గొనగా అందులో 20 మంది ఎంపికయ్యారు. ఆ 20 మందిలో బేతంచెర్ల మండలం నుంచి మధు తనూజ ఒక్కరే ఎంపికయ్యారు. రన్నింగ్‌, షాట్‌పుట్‌, లాంగ్‌ జంప్‌ వంటి శారీరక ప్రతిభ ఆధారంగా ఎంపికై న విద్యార్థిని గండి కోటలో 45 రోజుల శిక్షణలో పాల్గొని అక్కడ నుంచి ఎంపికై న 15 మందిలో స్థానం సంపాందించింది. అనంతరం లడఖ్‌లో 15 రోజుల శిక్షణకు హాజరైంది. ఈనెల 15వ తేదీన బయలు దేరి 25 తేదీన తోటి బృందం సభ్యులతో కలిసి మధు తనూజ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ చేరుకొని మరో మైలు రాయి సాధించింది. ఈ సందర్భంగా మధు తనూజను తల్లిదండ్రులు నాగేంద్ర, లక్ష్మీదేవి, జెడ్పీ హైస్కూలు హెచ్‌ఎం శేషాచలం, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేసి అభినందలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement