విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని ఈఈలు, డీఈఈ, ఏడీఈలను విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌ ఆదేశించారు. కర్నూలులోని విద్యుత్‌ భవన్‌లో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫోన్‌ ద్వారా వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. బిల్లింగ్‌, పోల్స్‌ తదితర సమస్యలపై పలువురు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరువ తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఈ విజయ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement